ఎస్ఎంఎస్ ద్వారా ఫిట్నెస్ ఛాలెంజ్‌ని పంపిన షేక్ హమదాన్
- October 18, 2017దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, కొందరు వ్యక్తుల్ని ఎంపిక చేసి, వారికి ఫిట్నెస్ ఛాలెంజ్ మెసేజ్‌ని పంపించడం జరిగింది. 30 రోజులు, రోజుకి 30 నిమిషాలుఏ ఫిట్నెస్ కోసం సమయం కేటాయించాలన్నది ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశ్యం. 'దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్' పేరుతో ఈ ఛాలెంజ్‌ని షేక్ హమదాన్ విసరడం జరిగింది. షేక్ హమదాన్ నుంచి మెసేజ్‌లు అందుకున్నవారంతా సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. తాము ఈ ఛాలెంజ్‌ని స్వీకరించామనీ, ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో ఉత్సాహం పెంచుతాయని, ఫిట్నెస్ పట్ల అవగాహనకు ఇది చాలా మంచి మార్గమని వారంతా అంటున్నారు. వివిధ సంస్థలు, కార్యాలయాలు కూడా క్రౌన్ ప్రిన్స్ నుంచి మెసేజ్‌లు అందుకున్నాయి.
తాజా వార్తలు
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు
- భారత్-ఒమన్ మధ్య పెరిగిన విమాన ఛార్జీలు..!
- కువైట్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
- ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్ నమోదు
- సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు విడుదల..
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్