కారులో సిగరెట్ ముట్టించడంతో చుట్టుముట్టిన మంటలు, ముగ్గురికి తీవ్ర గాయాలు
- October 18, 2017
యూఏఈ : గ్యాస్ ఆధారంగా పరిగెత్తే కారులో ఉన్నామనే సంగతి విస్మరించిన ఓ యువకుడు సిగరెట్ లైటర్ వెలిగించి విలాసంగా సిగరెట్ అంటించి పొగను గుండెల నిండా పీల్చుకొని వెలుపలకు పొగ వదిలేలోపు పెద్ద ఉపద్రవం జరిగిపోయింది. వాహనం లోపల ఒక్కసారిగా భగ్గుమని మంటలు చుట్టిముట్టేయి. మంగళవారం షార్జా వాసిట్ ప్రాంతంలో పార్కింగ్ స్థలం వద్ద జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ఎమిరాటీ యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం తెలియగానే ప్రమాద స్థలానికి వెళ్లిన పోలీసులు అక్కడ 14 ఏళ్ళు ..16 ఏళ్ల వయస్సులో ఉన్న ఇద్దరు యువకులను, కారులో 26 ఏళ్ల వ్యక్తి చిక్కుకొన్న మరో వ్యక్తిని ఘటనా స్థలంలో కనుగొన్నారు.అగ్నిజ్వాలల ధాటికి ఆ కారు అద్దాలను పూర్తిగా దెబ్బతిన్నాయి. మంటలలో చిక్కుకొన్న యువకుల్లో ఒకరికి ద్వితీయ స్థాయిలో కాలిన గాయాలవడంతో మెరుగైన చికిత్స కోసం అల్ ఖాసమి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఒక సీనియర్ పోలీస్ అధికారి " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, గ్యాస్ కిట్ నుండి సహజవాయువు వెలుపలకు విడుదల కావడం కారులోపల అద్దాలను మూసివేసిన నేపథ్యంలో ఓ యువకుడు సిగరెట్ ముట్టించడం కోసం లైటర్ తో అగ్నిని మండించడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. తల్లితండ్రులు తమ తమ పిల్లల వ్యవహార శైలిని పర్యవేక్షించాలని అలాగే వారి భద్రత కోసం జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







