సిగరెట్లను తాగి పీకలు ఎక్కడబడితే అక్కడ విసిరితే జరిమానా
- October 22, 2017కువైట్ : సిగరెట్ చివరి దమ్ము వరకు పీల్చి..వేళ్ళ మధ్య ఉన్న సిగరెట్ పీకను విలాసంగా ఎక్కడబడితే అక్కడ విసిరితే వాటికి జరిమానాలు కట్టకతప్పదని కువైట్ మునిసిపాలిటీ వాహనదారులను హెచ్చరించింది. కాలిబాటలు, పార్కులు లేదా బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ పీకలను విసిరిగొట్టి మునిసిపాలిటీ నిబంధనలను ఉల్లంఘించినవారికి 200 కువైట్ దినార్లు జరిమానా విధించనున్నారు . రాజధాని మున్సిపాలిటీ అత్యవసర జట్టు నాయకుడు జైద్ అల్- ఎనేజి మాట్లాడుతూ ఆర్టికల్ 1 లో మున్సిపాలిటీ సర్వీసుల చట్టం 9/1987 లో 5 కువైట్ దినార్లు నుంచి 200 కువైట్ దినార్లు వరకు జరిమానాలు అమలుచేయవచ్చు. వీధులు, కూడళ్లు , యార్డులు, వాహనాల పార్కింగ్ చేసే ప్రాంతాలు, పార్కులు, బహిరంగ స్థలాలలో సిగరెట్ పీకలను విసిరితే వారికి జరిమాణాలతో శిక్షించటం తప్పదని మునిసిపల్ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్‌లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్‌ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్