సుశాంత్ 'ఆటాడుకుందాం..రా'
- November 06, 2015
అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ 'ఆటాడుకుందాం..రా' అంటున్నాడు. 'కాళిదాసు'గా తెలుగు తెరకు పరిచయమైన సుశాంత్ 'కరెంట్', 'అడ్డా' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండేళ్ల విరామం తర్వాత తాజాగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 'ఆటాడుకుందాం..రా' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ని విడుదల చేసారు. ఆ వీడియోని సుశాంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫస్ట్‌లుక్ ని అఖిల్ అక్కినేని లాంచ్ చేసారు. అఖిల్ చిన్నప్పుడు నటించిన సిసింద్రి సినిమాలో ఆటాడుకుందాం.రా అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఆ పాటలోని పల్లవినే ''ఆటాడుకుందాం..రా'' టైటిల్‌గా పెట్టారు. చింతలపూడి శ్రీనివాసరావుతో కలిసి సుశాంత్ తల్లి ఎ.నాగసుశీల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో సుశాంత్ సరసన సోనమ్ కథానాయికగా పరిచయమవుతోంది. అనూప్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!
- యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!
- ఖతార్ లో 'టాన్నౌరిన్' బాటిల్ వాటర్ ఉపసంహరణ..!!
- బహ్రెయిన్ లో జోరుగా నేషనల్ ట్రీ వీక్..!!
- పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్..పలువురు అరెస్టు..!!
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!