రోడ్డు ప్రమాదాల్ని చిత్రీకరిస్తే క్రిమినల్ చర్యలే
- October 24, 2017
మనామా: రోడ్డు ప్రమాదాల్ని కెమెరాల్లో బంధించడం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయి. ఈ మేరకు పార్లమెంటరీ కమిటీ, బిల్లుని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ బిల్లులో సంబంధిత నేరాలకు 500 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించేలా వీలు కల్పించారు. మీడియా ప్రతినిథులు, అలాగే ప్రమాదాలకు గురైనవారిని మినహాయించారిక్కడ. ఫారిన్ ఎఫైర్స్, డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ ఈ బిల్లుకు మద్దతిచ్చాయి. ఆరు నెలలకు మించని జైలు శిక్ష, 500 బహ్రెయినీ దినార్స్‌కి మించని జరీమానాను ఈ కేసుల్లో విధించాలని బిల్లులో పేర్కొన్నారు. ప్రమాదాల్లో గాయపడ్డవారు లేదా, తమవారిని కోల్పోయినవారు పడే వేదన చాలా తీవ్రమైనదనీ, అలాంటి ఘటనల్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో సర్కులేట్ చేయడం మానవత్వం అనిపించుకోదనీ, ఈ నేపథ్యంలోనే ఈ బిల్లును తీసుకురావాల్సి వస్తోందని ఎంపీ మొహమ్మద్ అల్ మారిఫి చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







