దుబాయ్లో ఎమిరేటీ కిడ్నాప్: ఇద్దరికి జైలు
- October 24, 2017
దుబాయ్: ఎమిరేటీ వ్యక్తిని కిడ్నాప్ చేసి తీవ్రంగా గాయపర్చిన కేసులో ఇద్దరు వ్యక్తులకు రెండేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. 32, 38 ఏళ్ళ వయసున్న ఇద్దరు పాకిస్తానీ వ్యక్తులు ఈ కిడ్నాప్ కేసులో దోషులుగా తేలారు. జైలు శిక్ష అనంతరం వీరిని డిపోర్ట్ చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. ఇద్దరు అన్నదమ్ములు, అల్ నహ్దాలోని బాధితుడి ఇంటికి వెళ్ళి, అతను బయటకొచ్చాక అతనిపై దాడికి దిగారు. 33 ఏళ్ళ బాధితుడు, ఎదురు తిరిగేందుకు ప్రయత్నించగా, కత్తితోనూ నిందితులు దాడికి దిగారు. దాడి అనంతరం బాధితుడి నుంచి మొబైల్ ఫోన్ని లాక్కున్నారనీ, కారు తాళాన్నీ దొంగిలించారని బాధితుడు పేర్కొన్నారు. ఆ కారులోనే తనను కట్టిపడేశారనీ, ఎలాగోలా తప్పించుకున్న తాను పోలీసులకు సమాచారం అందించానని బాధితుడు చెప్పారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడి నుంచి సమాచారం సేకరించిన నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద వారిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







