ప్రాస్టిట్యూషన్: 14 ఏళ్ళ బాలికను రక్షించిన దుబాయ్ పోలీస్
- October 24, 2017
దుబాయ్ పోలీస్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీమ్స్, 14 ఏళ్ళ బాలికను వ్యభిచార కూపం నుంచి రక్షించారు. రెండు నెలలపాటు ఆమెపై అత్యాచారం జరిపారనీ, ఆమెపై వ్యభిచారం చేయాల్సిందిగా బలవంతపెట్టారని పోలీసులు వివరించారు. సంఘటనా స్థలం నుంచి పలువురు మహిళల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి వయసు 24 ఏళ్ళుగా పేర్కొంటూ ఆసియా నుంచి ఆమెను జీసీసీ దేశాల మీదుగా దుబాయ్‌కి తీసుకొచ్చినట్లు నిందితులు పేర్కొన్నారు. బాధితురాలిని దుబాయ్ ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ అండ్ విమెన్ కేర్‌కి తరలించారు. నిందితులపై ట్రయల్ ముగిసేంతవరకు బాలికను అక్కడే ఉంచనున్నారు. నిందితుల నుంచి తాను ఏమాత్రం డబ్బు తీసుకోలేదని, విటుల దగ్గరకు తనను బలవంతంగా పంపించేవారనీ, ఆ సమయంలో బాధతో ఏడ్చేదాన్ననని బాధితురాలు చెప్పింది. బాలిక విషయమై కాన్సులేట్‌తో మాట్లాడుతున్నామని హ్యూమన్ ట్రాఫికింగ్ మానిటరింగ్ సెంటర్ డైరెక్టర్ కల్నల్ అబ్దుల్రహ్మాన్ అల్ షయీర్ చెప్పారు. ఈ ఘటనలో బంగ్లాదేశ్‌కి చెందిన మహిళ, పురుషుడ్ని నిందితులుగా తేల్చారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







