అమెరికాలోని పర్డ్యూ వర్సిటీ నిపుణులు ప్రత్యేకత
- October 24, 2017
మెదడు స్కానింగ్ చిత్రాలను విశ్లేషించి మనం ఏం చూస్తున్నామో చెప్పే కృత్రిమ మేధస్సును శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మెదడు విధులను మెరుగ్గా అవగాహన చేసుకోవడంలో ఇది ఎంతగానో తోడ్పడే వీలుంది. మనుషుల ముఖాలు, వస్తువులను గుర్తుపట్టడంలో కీలకంగా పనిచేసే కాన్వొల్యూషన్ న్యూరల్ నెట్‌వర్క్ (సీఎన్‌ఎన్) అల్గారిథమ్‌లను దీనిలో ఉపయోగించారు. వీటికి 11.5 గంటల నిడివున్న ముగ్గురు మహిళల మెదడు స్కానింగ్ వీడియోలతో అమెరికాలోని పర్డ్యూ వర్సిటీ నిపుణులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మెదడులోని దశ్య సంబంధిత విభాగాల్లో చోటుచేసుకునే పరిణామాలపై అవగాహన కల్పించారు. అనంతరం మరి కొందరి చిత్రాలతో దీన్ని పరీక్షించారు. దీంతో మెదడు చిత్రాలను విశ్లేషించి ఏం చూస్తున్నారో ఈ సాంకేతికత చెప్పగలుగుతోందని పరిశోధనకు నేతృత్వం వహించిన హైగ్వాంగ్ వెన్ తెలిపారు. ఓ వస్తువును చూస్తున్నప్పుడు మన మెడులోని పలు ప్రాంతాలు ఒకదానితో మరొకటి ఎలా సమాచారాన్ని పంచుకుంటున్నాయో గుర్తించగలిగామని వివరించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







