ఇరాన్ తరపున గూఢచర్యం చేసిన ఐదుగురికి జీవిత ఖైదు
- November 06, 2015
ఇరాన్ కార్యకర్తలతో కలసి, బహ్రైన్ లోని ఎ. టి. ఎం. లను పేల్చివేయడానికి కుట్ర పన్నిన ఐదుగురికి యావజ్జీవ
కారాగార శిక్ష విధించబడింది. అహ్మద్ షరీఫ్ (20), అలీ అబ్దుల్ హుస్సేన్ (22) అనే ఇద్దరు ఇరాన్ కు వెళ్లి, 'ఇరాన్
రివోల్యుషనరి గార్డ్ కాంప్' లో ఆయుధాలు మరియు మందుగుండు శిక్షణ పొందిన అనంతరం బహ్రైన్ కు తిరిగి వచ్చి, సాదిక్ ఇబ్రహీం అల్ హయికీ, జస్సిం అహ్మద్ అబ్దుల్లా మరియు ఫదేల్ అబ్బాస్ లతో కలసి నేషనల్ బ్యాంకు ఆఫ్ బహ్రైన్ యొక్క ఎ. టి. ఎం. మిషన్ల వద్ద బాంబులు అమర్చడానికి పన్నాగం పన్నారు. అంటే కాకుండా బహ్రైనీ
టీనేజర్లకు మిలీషియా శిక్షణ ఇవ్వడానికి కూడా వీరే బాధ్యులు. ఈ ఐదుగురికి - విదేశాలతో కలసి కుట్ర పన్నినందుకు, విదేశంలో మిలీషియా శిక్షణ పొందినందుకు, తీవ్రవాద దళంలో సభ్యులైనందుకు ఈ శిక్ష విధించినట్టు నేడు కోర్టువారు తీర్పు చెప్పారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







