వెన్న తింటే కొవ్వు పెరగదు.. గుండెకు మేలే..
- October 26, 2017వెన్న తింటే కొవ్వు పెరగదు.. గుండెకు మేలే.. అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. వెన్న తింటే కొవ్వు పెరుగుతుందనీ, బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటారు. అయితే ఇందులో నిజం లేదని.. వెన్నలోని ఎ విటమిన్ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని వైద్యులు చెప్తున్నారు. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు గుండెను దృఢంగా ఉంచుతాయి.
అంతేకాకుండా వెన్నను ఆహారం ద్వారా తీసుకోవడం వలన త్వరగా కడుపు నిండినట్లు ఉండడంతో పాటు ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీని వలన అధికబరువు సమస్య తలెత్తదు. వెన్నలో మంచి కొలెస్ట్రాల్ వుండటం ద్వారా చిన్నపిల్లలకు ఇవ్వడం ద్వారా మేలే జరుగుతుంది.
చిన్నపిల్లలకు రోజూ రెండు స్పూన్ల వెన్న ఇవ్వడం ద్వారా.. వారి మెదడూ, నాడీ వ్యవస్థ ఎదుగుదల చక్కగా ఉంటుంది చిన్నతనం నుంచి పిల్లలకు తగు మోతాదులో వెన్నను తినడం అలవాటు చేయడం మంచిది. పెద్దలు మాత్రం రోజుకో స్పూన్ వెన్నను ఆహారంలో చేర్చుకుంటే హృద్రోగ వ్యాధులు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్