హిమాచల్ ప్రదేశ్‌ని వణికించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదు
- October 26, 2017
హిమాచల్ ప్రదేశ్‌లో ఇవాళ ఉదయం సంభవించిన భూ ప్రకంపనలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. శుక్రవారం ఉదయం 8.07 సమయంలో మండి ప్రాంతం మొత్తం ప్రకంపనలకు గురయ్యింది. దీంతో జనాలు ఇళ్లనుంచి బయటికి పరుగులు తీశారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టంగానీ, ఆస్తినష్టంగానీ జరక్కపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈనెల మొదట్లో ఇదే తీవ్రతతో హిమాచల్ ప్రదేశ్‌లోని చాంబా ప్రాంతంలో భూకంపం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. 1905లో హిమాచాల్ ప్రదేశ్‌లో అతిపెద్ద భూకంపం చోటుచేసుకుంది. దీంతో కాంగ్రా లోయలో దాదాపు 20 వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







