కుర్ర హీరోలకంటే స్పీడ్‌గా దూసుకుపోతున్న బాలకృష్ణ

కుర్ర హీరోలకంటే స్పీడ్‌గా దూసుకుపోతున్న బాలకృష్ణ

బాలకృష్ణ ఏమాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. వంద సినిమాలు కంప్లీట్ అయ్యాక మరింత జోష్ పెంచాడు. రీసెంట్ గా 101వ చిత్రంగా పైసా వసూల్ తో వచ్చిన బాలయ్య, ఇప్పుడు 102వ చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని నవంబర్ 1న రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యింది.

బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ మూవీలో హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. సినిమాకి కర్ణ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. సినిమాని త్వరగా కంప్లీట్ చేసే, సంక్రాంతి బరిలో దిగడానికి నటసింహం రెడీ అవుతోంది.

Back to Top