దహీ సెవెన్ లీఫ్స్ వడలు
- November 03, 2017కావలసిన పదార్థాల : తోటకూర - ఒక కట్ట, పాలకూర - ఒక కట్ట, చుక్కకూర - ఒక కట్ట, పుదీనా - ఒక కట్ట, కొత్తిమీర - ఒక కట్ట, కరివేపాకు - రెండు రెబ్బలు, గోంగూర - ఒక కట్ట, మినపపప్పు - అరకిలో, పచ్చిమిరపకాయలు - ఎనిమిది, చిక్కని పెరుగు - ఒక లీటరు, శెనగపప్పు - ఒక చెంచా, మినపపప్పు - అర చెంచా, జీలకర్ర - ఒక చెంచా, ఆవాలు -చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు చెంచాలు, ఉప్పు - తగినంత, ఎండుమిరపకాయలు - ఆరు, నూనె - తగినంత.
తయారీ విధానం: నానబెట్టి రుబ్బిన మినపపప్పులో ఉప్పు, పర్చిమిర్చి, ఆకు కూరల తురుము వేసి బాగా కలపాలి. దీన్ని వడలుగా వేసి బాగా వేయించుకోవాలి. తరువాత మరో స్టౌ మీద గిన్నె పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి కాగాక సెనగపప్పు, మినపపప్పు, జీలకర్ర, ఆవాలు, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగాక పెరుగులో కలపాలి. ఇప్పుడు వేయించిన వడల్ని ఈ పెరుగులో వేయాలి. అంతే దహీ సెవెన్ లీవ్స్ వడలు రెడీ.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!