విదేశాల్లో పనిచేసే ఉద్యోగులకూ భారతీయులు భవిష్యనిధి
- November 03, 2017
విదేశాల్లో పనిచేసే భారతీయులు కూడా ఇకపై ఉద్యోగుల భవిష్యనిధి ప్రయోజనాన్ని పొందవచ్చని కేంద్ర భవిష్యనిధి కమిషనర్ వీపీ జోయ్ శుక్రవారం వెల్లడించారు. 'మోసాలతో జరిగే నష్టాలను నివారించే మార్గాల'పై దిల్లీలో ఏర్పాటుచేసిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సౌకర్యాన్ని పొందేందుకు అంతర్జాలంలో (ఆన్‌లైన్) ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అయితే వారు పనిచేస్తున్న దేశంలో ఇలాంటి పథకం లేకపోతేనే ఇది వర్తిస్తుందని తెలిపారు. భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్, సహా 18 దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. సంబంధిత ఉద్యోగులకు అన్నివిధాలుగా అనుకూలంగా ఉండేలా ఈ విధానాన్ని రూపొందించినట్లు జోయ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







