అశ్లీలత ను తొలగించేందుకు నడుంబిగించిన ఇండోనేసియా
- November 07, 2017
జకర్తా: ఇంటర్నెట్లో అశ్లీల సమాచారాన్ని తొలగించేందుకు ఇండోనేసియా సిద్ధమైంది. ఇప్పటికే ప్రముఖ మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్‌కు హెచ్చరికలు జారీ చేయగా.. త్వరలో గూగుల్ సహా, ఇతర సెర్చింజిన్లకు, మేసేజింగ్ సర్వీసులు అందించే కంపెనీలకు సమన్లు జారీ చేయనుంది.
ముస్లిం ప్రధాన దేశమైన ఇండోనేసియాలో ఇప్పటికే ఇంటర్నెట్పై సెన్సార్ విధిస్తున్నారు. ఇక్కడ సంప్రదాయవాదులు ఎక్కువ. ఈ నేపథ్యంలో అశ్లీల సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి తొలగించాలని ఇండోనేసియా భావిస్తోంది. ఈ మేరకు గూగుల్ సహా, ఇతర సర్వీస్ ప్రొవైడర్లను తమ నెట్‌వర్క్‌లో అలాంటి కంటెంట్ ఉండకుండా తొలగించాలని సూచించనున్నట్లు ఆ దేశ కమ్యూనికేషన్, సమాచార మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ శామ్యూల్ వ్యాఖ్యానించారు.
అంతకుముందు సోమవారం వాట్సాప్‌కు ఇదే తరహా హెచ్చరికలు జారీ చేసింది. 48 గంటల్లో మెసెంజర్లో ఉండే అశ్లీలతతో కూడిన గ్రాఫికల్ ఇంటర్‌ఛేంజ్ ఫార్మాట్ (జిఫ్) ఇమేజులను తొలగించాలని సూచించింది. అయితే, ఎన్క్రిప్షన్ కారణంగా అది సాధ్యపడదని వాట్సాప్ చెప్పింది. వాట్సాప్‌లో థర్డ్ పార్టీ సంస్థలు ఈ సేవలు అందిస్తాయని పేర్కొంది. ఆయా సర్వీస్ ప్రొవైడర్లకు ఆ విషయాన్ని సూచించాలని తెలిపింది.
ఈ నేపథ్యంలో జిఫ్ ఇమేజ్‌లు అందించే టెనార్ సంస్థ మంగళవారం అలాంటి కంటెంట్ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది. ఐఫోన్లో వాట్సాప్ వినియోగించే వారికి మంగళవారం ఈ తరహా జిఫ్‌లు కనిపించలేదు. తమ అభ్యర్థనకు స్పందించిన నేపథ్యంలో నిషేధాన్ని అమలు చేయబోమని డైరెక్టర్ జనరల్ తెలిపారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!