ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్
- November 11, 2017ప్లాపుల్లో ఉన్న దర్శకుడి వైపు చూసేందుకు ఏ స్టార్ హీరో కూడా సాహసించడు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం ఓ సౌత్ డైరెక్టర్ టాలెంట్‌పై పూర్తి భరోసాగా ఉన్నాడు. అందుకేనేమో తన హిట్ మూవీ సీక్వెల్‌ను ఆ దర్శకుడి చేతిలో పెట్టాడట.
కెరీర్ ప్రారంభంలో రీమేక్ సినిమాలతో దర్శకుడిగా బాలీవుడ్ బాక్సాపీస్ దుమ్ముదులిపిన ప్రభుదేవా ఆ తర్వాత మాత్రం సొంత కథల కారణంగా పరాజయాలు ఎదుర్కొని కోలీవుడ్ బాట పట్టాడు. తమిళనాట నిర్మాతగా బిజీ అవుతోన్న ప్రభుదేవాకు తిరిగి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందట. అది కూడా సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరో నుంచి గతంలో వరుస ప్లాపులతో సల్మాన్ కెరీర్ కొట్టుమిట్టాడుతున్న టైమ్ లో 'పోకిరి' రీమేక్ 'వాంటెడ్'తో ఈ కండలవీరుడికి ఓ బడా హిట్ ఇచ్చాడు ప్రభుదేవా. ఇప్పుడు ఆ అనుబంధంతోనే మరోసారి ప్రభుదేవాతో కలసి వర్క్ చేస్తానంటున్నాడట సల్మాన్.
ఏడేళ్ల క్రితం సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా వచ్చిన 'దబంగ్' చిత్రం సల్మాన్ కెరీర్‌కు భారీ విజయాన్ని అందించింది. దీంతో రెండేళ్ల తర్వాత అర్బాజ్ ఖాన్ దర్శకత్వంలో ఈ సినిమాకు సీక్వెల్ రాకా మరోసారి సల్మాన్‌కు విజయం లభించింది. దీంతో కొన్నాళ్లుగా మూడో సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడీ బాధ్యతను ప్రభుదేవాపై ఉంచాడట సల్మాన్. కొద్దిరోజుల క్రితం ఇదే విషయమై ప్రభుదేవాను పిలిపించి ముచ్చటించాడట కూడా. సల్మాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు కూడా. ప్రస్తుతం 'రేస్-3' షూటింగ్లో పాల్గొంటున్న సల్మాన్ ఆ తర్వాత 'భరత్' అనే చిత్రంలో నటించనున్నాడు. ఆ తర్వాతే 'దబంగ్-3' సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ లోపు సొంత కమిట్మెంట్స్ పూర్తి చేసుకుని సల్మాన్ సినిమాపై దృష్టి సారించనున్నాడు ప్రభుదేవా. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో భారీ విజయం లభిస్తుందేమో చూడాలి..!
తాజా వార్తలు
- అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్
- టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. పాలకమండలి కొత్త సభ్యులు వీరే..
- ఫుట్‌బాల్ ఆటగాళ్లకు క్షమాభిక్ష ప్రసాదించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్‌కు 4 రోజులపాటు విమాన సర్వీసులను రద్దు చేసిన ఎతిహాద్..!!
- చట్టవిరుద్ధమైన విక్రయాలు.. కార్లను తొలగించాలని నోటీసులు జారీ..!!
- కువైట్‌లోని కార్మికుల్లో అగ్రస్థానంలో భారతీయులు..!!
- మదీనాలో విమానం మెట్లపై నుంచి పడి మహిళా ప్యాసింజర్ మృతి..!!
- ఖతార్ లో మెరైన్ టూరిజం ట్రాన్స్ పోర్ట్ నిబంధనల్లో మార్పులు..!!
- రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
- 500 ఏళ్ల తర్వాత అయోధ్య ఆలయంలో దీపావళి..