55 మంది భారత జాలర్లను అరెస్ట్ చేసిన పాక్
- November 12, 2017
భారత్కు చెందిన 55 మంది జాలర్లను పాక్ అదుపులోకి తీసుకుంది. ఆ దేశ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి చేపలు పడుతున్నారంటూ వారిని ఆ దేశ తీర ప్రాంత గస్తీదళాలు అదుపులోకి తీసుకున్నాయి. జాలర్లకు చెందిన 9 పడవలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా సిబ్బంది వెల్లడించారు. ప్రాథమిక విచారణ అనంతరం వారిని పోలీసులకు అప్పగించామని, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు వారిని హాజరు పరచనున్నామని తెలిపారు. అరేబియా సముద్రంలో చేపలు వేటాడే సమయంలో ఇలా ఇరు దేశాలకు చెందిన జాలర్లు గస్తీ సిబ్బందికి చిక్కడం తరచూ జరుగుతుంటుంది. ప్రాదేశిక జలాలకు సంబంధించి సరైన విభజన లేకపోవడం, జాలర్లు సాంకేతికతను ఉపయోగించకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. గత నెల 29న 68మంది భారత జాలర్లను పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్ 2016 నుంచి జనవరి 2017 మధ్య మొత్తం 438 మంది జాలర్లకు పాక్ విముక్తి కలిగించింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







