అమెరికాలో భారత సంతతి వ్యక్తి హత్య.!
- November 12, 2017
అకారణంగా ఓ వ్యక్తి జరిపిన కాల్పుల కారణంగా భారత సంతతికి చెందిన 40ఏళ్ల ఆకాశ్ ఆర్ తలాటి ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని ఉత్తరకరోలినాలో ఆకాశ్‌కు నైట్స్ ఇన్ అండ్ డైమండ్స్ జెంటిల్‌మన్ క్లబ్ ఉంది. ఆ క్లబ్‌కు మార్కెసీ దెవిట్(23) అనే వ్యక్తి వచ్చాడు. క్లబ్‌లో దెవిట్ గందరగోళం సృష్టించడంతో భద్రతా సిబ్బంది అతడిని బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో కోపంతో వూగిపోయిన దెవిట్ తన కారు దగ్గరికి వెళ్లి తుపాకీ తీసుకొచ్చి భదత్రా సిబ్బందిపై కాల్పులు జరిపాడు.
అదే సమయంలో ఆకాశ్ రావడంతో అతడికి బుల్లెట్లు తగిలాయి. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. కాగా.. తీవ్ర బుల్లెట్ గాయాల పాలైన ఆకాశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కాల్పులు జరిపిన దెవిట్‌ను అరెస్టు చేశారు. ఆకాశ్ గుజరాత్‌వాసిగా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. 'ఆకాశ్ హత్యకు సంబంధించిన విషయాలను అమెరికాలోని భారత దౌత్యకార్యాలయ అధికారులు సమాచారం అందించారు. వాళ్ల కుటుంబసభ్యులతో మాట్లాడాం. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం' అని సుష్మా ఆదివారం ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







