ఇరాక్‌లో భూకంపం... 7.3 తీవ్రత...భారీ ప్రాణ నష్టం
- November 12, 2017
బాగ్దాద్: ఇరాక్‌లో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూకంపం రావడంతో ఇళ్లలోని జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డు మీదికి పరుగులు తీశారు. ఆదివారం అర్థరాత్రి వచ్చిన భూకంపం థాటికి 150 మంది మృతి చెందారు. వేలాది మందికి గాయాలయ్యాయి. అత్యవసర చికిత్సకై క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైందని అమెరికా భూభౌతిక సర్వే(యూఎస్జీఎస్) సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అలాబా పట్టణానికి 32 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. 14 రాష్ట్రాలపై భూకంప ప్రభావం చూపనుందని అధికారులు తెలిపారు. మరోవైపు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు కువైట్, యూఏఈ లోనూ ఆదివారం అర్ధరాత్రి భూకంపం వచ్చింది.. అయితే ఇక్కడ ప్రాణ, ఆస్తి నష్టం ఎంత వాటిల్లిందన్న విషయం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







