అంథుడని ఐఐటీలో సీటివ్వనన్నారు.. 50 కోట్ల కంపెనీకి సీఈవోగా ఎదిగాడు

- November 22, 2017 , by Maagulf
అంథుడని ఐఐటీలో సీటివ్వనన్నారు.. 50 కోట్ల కంపెనీకి సీఈవోగా ఎదిగాడు

అంథుడని అందరూ జాలి పడడం మాని అసహ్యించుకున్నారు... అన్నిచోట్లా నిరాదరణకు గురయ్యాడు... అయినా అమ్మానాన్న కన్న బిడ్డ కష్టాన్ని కడుపులో దాచుకుని కొడుకు ఎదుగుదలని తమ కళ్లతో చూసుకుని ఆనందించారు.. 

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఓ చిన్న పల్లెటూరిలో జన్మించాడు శ్రీకాంత్. పుట్టుకతోనే అంథుడిగా జన్మించాడు. మూడేళ్ల వయసు వచ్చాక కొడుకుని అంథుల పాఠశాలలో చేర్పించాడు తండ్రి. దేవుడు శ్రీకాంత్‌కి కళ్లు ఇవ్వలేదు కానీ.. కావలసినంత జ్ఞానాన్నిచ్చాడు. పదవతరగతి వరకు క్లాసులో ఫస్టుగా నిలిచాడు. ప్లస్ టూలోనూ 90 శాతం మార్కులు తెచ్చుకున్నాడు. చదువులోనే కాదు ఆటల్లోకూడా రాణించాడు. క్రికెట్‌లోనూ, చెస్‌లోనూ చాంపియన్‌గా ఎదిగాడు. పై చదువుల నిమిత్తం ఇంజనీరింగ్ చదవడానికి ఏ కాలేజీకి అప్లై చేసినా సీటివ్వడానికి నిరాకరించారు. శ్రీకాంత్ ప్రతిభా పాటవాల్ని గుర్తించిన లీడ్ ఇండియా ప్రాజెక్ట్ సీటిచ్చింది. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేపట్టిన ప్రాజెక్ట్‌ అయిన దీంట్లో చదువుకునే అవకాశం రావడం అదృష్టంగా భావించాడు. ఇంజనీరింగ్‌లో సీటివ్వనన్న కాలేజీలు తల దించుకునేలా మరింత పట్టుదలతో కృషి చేసి విదేశాల్లోని యూనివర్శిటీలకు అప్లై చేశాడు. మస్సాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఆఫర్ లెటర్ అందుకున్నాడు. ఆ యూనివర్శిటీలో అడ్మిషన్ పొందిన మొట్టమొదటి విదేశీ విద్యార్థి శ్రీకాంత్ కావడం మన తెలుగువారికి గర్వ కారణం. చదువు పూర్తి చేసుకుని మళ్లీ భారత్‌లో అడుగు పెట్టాడు. తనలాంటి వారికి చేయూతనందించాలనుకున్నాడు. కంపెనీని స్థాపించాడు. తనకు సీటివ్వనన్న కాలేజీల మానసిక లోపం ముందు తన అవయవలోపం చాలా చిన్నదని నిరూపించాడు. 50 కోట్ల టర్నోవర్ సాధించే కంపెనీకి సీఈఓగా ఎదిగాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com