మోడీ హైదరాబాద్ పర్యటన వివరాలు

- November 27, 2017 , by Maagulf
మోడీ హైదరాబాద్ పర్యటన వివరాలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. మోదీ నేటి మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అటునుంచి మధ్యాహ్నం 2.05 గంటలకు మియాపూర్ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2.23కి మెట్రో పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన ఆడియో విజువల్ దృశ్యమాలికను తిలకిస్తారు. మెట్రో రైలు బ్రోచర్‌, యాప్‌ను విడుదల చేస్తారు. మియాపూర్‌-కూకట్‌పల్లి-మియాపూర్‌ వరకు మెట్రో రైలులో ప్రయాణిస్తారు. మధ్యాహ్నం 3.15 గంటలకు హెచ్‌ఐసీసీ చేరుకుంటారు. 3.35 నుంచి 3.55 వరకు 20 నిమిషాల పాటు ఇవాంకా ట్రంప్‌తో ప్రధాని భేటీకానున్నారు. 4 నుంచి 4.25 గంటల వరకు భారత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రధాని మోదీని కలుస్తారు. అనంతరం 4.43 గంటలకు అధికారికంగా జీఈఎస్‌ సదస్సు ప్రారంభం కానుంది. 4.45 నుంచి 4.50 వరకు ఇవాంకా ఉపన్యాసం ఇస్తారు. 4.50 నుంచి 5.10 వరకు ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.

ఆ తర్వాత కృతజ్ఞతలు తెలుపుతూ కేంద్రమంత్రి సుష్మా ప్రసంగం ఉంటుంది. సా.5.30-5.48 వరకు మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల బృందాలతో ప్రధాని మోదీ సమావేశమవుతారు. 5.56 నుంచి 6.03 వరకు గ్రూప్ మీటింగ్‌కు ప్రధాని హాజరవుతారు. 6.03-6.32 వరకు నలుగురు పారిశ్రామిక దిగ్గజాలతో మోదీ భేటీ కానున్నారు.

6.32- 7గంటల వరకు రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్‌ బయల్దేరుతారు. 8 నుంచి 10 వరకు అక్కడే ఉంటారు. రాత్రి 8.05-8.20 వరకు ట్రీ ఆఫ్ లైఫ్ పేరుతో ఫలక్‌నుమా ప్యాలెస్‌లో భారతీయకళలు, దుస్తుల ప్రదర్శన ఉంటుంది.

8.20 నుంచి 8.35 వరకు భారత చారిత్రక వారసత్వంపై లైవ్ షో ప్రదర్శిస్తారు. 8.45 నుంచి 9.50 వరకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటుచేసిన విందులో ప్రధాని పాల్గొంటారు అటుతరువాత 10.25 గంటలకు ప్రధాని మోదీ ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com