మీడియాకు షాక్ ఇచ్చిన కేటీఆర్

- November 27, 2017 , by Maagulf
మీడియాకు షాక్ ఇచ్చిన కేటీఆర్

మంత్రి కేటీఆర్ మీడియాకు షాక్ ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ మెట్రో రైలుని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలో భద్రతని కట్టుదిటం చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాని వచ్చి పర్యటనని ముగించుకొని వెళ్లే వరకు ఏ చిన్ని అడ్డంకి రాకుండా ముందుగానే పక్కా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.
మెట్రో ప్రారంభోత్సవానికి మీడియాకు అనుమతి ఉండదని చెప్పి షాక్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. సోమవారం మంత్రి కేటీఆర్‌ మియాపూర్‌లో ఏర్పాటు చేసిన మెట్రో పైలాన్‌ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఎస్పీజీ సూచనల మేరకు భద్రత కట్టుదిట్టం చేశామని, మెట్రో ప్రారంభోత్సవానికి మీడియాకు అనుమతి ఉండదని తెలిపారు. అయితే, దూరదర్శన్‌ నుంచి ఫీడ్‌ వస్తుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com