హాస్టల్ విద్యార్థులు ప్రతీరోజూ జాతీయగీతం పాడాల్సిందే
- November 27, 2017
జైపూర్ : ప్రభుత్వ హాస్టళ్లలోని విద్యార్థులు ప్రతీరోజూ ఉదయం ఏడు గంటలకు జాతీయ గీతాన్ని పాడాలని రాజస్థాన్ రాష్ట్ర సర్కారు ఆదేశాలు జారీ చేసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని 800 ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వసతిగృహాల్లో ఉంటున్న 40వేల మంది విద్యార్థులు ప్రతీరోజూ ఉదయాన్నే ఏడు గంటలకు జాతీయ గీతాన్ని తప్పనిసరిగా పాడాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమీత్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల్లో జాతీయ భావాన్ని పెంపొందించేందుకే ఉదయం జాతీయగీతాన్ని ఆలపించాలని ఆదేశించినట్లు రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరారాజే చెప్పారు. గతంలో పాఠశాలల్లో విద్యార్థులందరూ సూర్యనమస్కారాలు తప్పనిసరిగా చేయాలని వసుంధరా రాజే సర్కారు ఆదేశించింది. ఈ ఆదేశాలపై కొందరు కోర్టుకెళ్లగా దాన్ని విద్యార్థుల ఐచ్ఛికానికి వదిలివేసింది.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







