ఏఐసీసీ అధ్యక్ష పదివికి రేపు రాహుల్ నామినేషన్

- December 03, 2017 , by Maagulf
ఏఐసీసీ అధ్యక్ష పదివికి రేపు రాహుల్ నామినేషన్

కాంగ్రెస్‌లో రాహుల్ పట్టాభిషేకానికి అంతా సిద్ధమైంది. ఏఐసీసీ అధ్యక్ష పదివికి రేపు ఆయన నామినేషన్ వేయనున్నారు. ఇంతవరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడంతో రాహుల్ ఎన్నిక ఏకగ్రీమయ్యే అవకాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సోమవారం రాహుల్ గాంధీ నామినేషన్ వేయనున్నారు. ఆయన్ని సమర్దిస్తూ పార్టీ నేతలు మొదట నాలుగు సెట్ల నామినేషన్లు వేయనున్నారు. ప్రతి పత్రంపై 10 మంది పిసిసి డెలిగేట్స్ సంతకాలు చేయాల్సి ఉంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్, సీనియర్లు ఆంటోని, ఆజాద్, ఖర్గే తదితరులు సంతకాలు చేయనున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నాయకులు, ఎంపీలు, రాష్ట్రాల్లోని సీనియర్ నాయకులు కూడా నామినేషన్ సెట్లు దాఖలు చేయనున్నారు. ప్రతి రాష్ట్రానికి సగటున రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేసేందుకు అనుమతించారు. అయితే ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్ధితిని దృష్ట్యా  కేరళకు 4, ఉత్తర ప్రదేశ్‌కు 6 సెట్లు దాఖలు చేసే అవకాశం లభించింది. ఇప్పటికే ముఖ్య నాయకులంతా ఢిల్లీ చేరారు. సోమవారంతో నామినేషన్ దాఖలుకు గడువు ముగుస్తుండగా.. ఇప్పటివరకు ఒక్కటి కూడా దాఖలు కాలేదు. దీంతో రాహుల్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. రాహుల్ ఏఐసిసి అధ్యక్షుడు కాబోతున్నారన్న ఆనందోత్సవాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా సంబరాలకు కాంగ్రెస్ కేడర్ సిద్ధమవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com