ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు
- November 15, 2015
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. టర్కీలో జీ 20 సమావేశాలు జరుగుతున్నసమయంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. జీ 20 సమావేశాల సందర్భంగా హైఎలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో రక్షణ దళాలు ఘజియాంటెప్ ప్రావిన్స్ లోని ఒక ఇంటిపై సోదాలు జరుపుతున్న సమయంలో ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు. గాయపడిన పోలీసులను ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని మరవక ముందే టర్కీలో ఉగ్రవాదులు చెలరేగారు. భారత ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు దేశాధినేతలు జీ 20 సమావేశాల్లో పాల్గొనేందుకు టర్కీలోనే ఉన్నారు. గత అక్టోబర్ లో టర్కీ రాజధాని అంకారాలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో100 మందికి పైగా చనిపోయాగా, వందల సంఖ్యలో గాయపడ్డారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







