హార్రర్ యాక్షన్ ఎంటర్టైనర్గా 'శివ గంగ'
- November 15, 2015
హార్రర్, కామెడీ చిత్రాలకు ప్రస్తుతం టాలీవుడ్లో మంచి డిమాండ్ ఉంది. ఇటీవలి కాలంలో ఈ నేపథ్యంలో వచ్చిన చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరించారు. అయితే వారిని అలరించేందుకు మరో హార్రర్ సినిమా సిద్ధమవుతోంది. శ్రీరామ్, రాయ్‌లక్ష్మీ, సుమన్, మనోబాల, వడివుక్కరసిలు ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'శివ గంగ'ను ఈ నెల 27న విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ సినిమాకు ఎక్సెల్లా క్రియేషన్స్ బ్యానర్‌పై వి.సి.వడి ఉడయాన్ దర్శకత్వం వహించగా, చిత్రాన్ని కె.శివనాథ్, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిలు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 'అరుంధతి', 'కాంచన', 'చంద్రముఖి', 'గంగ', 'చంద్రకళ' చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా 'హార్రర్ యాక్షన్ ఎంటర్టైనర్'గా ఉంటుందని సినీ యూనిట్ చెబుతోంది. రెండు ఆత్మలు ప్రతీకారం తీర్చుకోవడమనే నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో సినిమాను తీర్చిదిద్దినట్టు నిర్మాతలు తెలిపారు. ఊహించని మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా సినిమా సాగుతుందని అన్నారు. హీరో శ్రీరామ్ ఇందులో శివ, శక్తి అనే రెండు పాత్రలను పోషించాడని, రాయ్‌లక్ష్మీ గ్లామర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. దాదాపు 37 నిమిషాల పాటు దీంట్లో గ్రాఫిక్స్ ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







