పెసలు తో ఆరోగ్య చిట్కాలు
- November 15, 2015
పాయసంగా.. పొంగలిగా.. మొలకెత్తిన గింజలు.. సున్నండలు.. పెసరట్టు.. ఎలా తీసుకున్నా.. పెసల రుచి అమోఘంగా ఉంటుంది. కమ్మని రుచి.. సువాసనతో తింటుంటే తినాలిపిస్తాయి పెసల వంటకాలు. రకరకాల వంటకాల్లో, చర్మ సౌందర్య సాధనాల్లో ఉపయోగించే పెసలు.. ఆరోగ్య ప్రయోజనాల గనిగా చెప్పవచ్చు వేసవిలో సన్ టాన్ నివారిస్తుంది, చర్మం తెల్లగా మార్చుతుంది భారతీయ సంప్రదాయ ఆహారాల్లో పెసలు ఒకటి. పూర్వం నుంచి ఎక్కువగా పెసలు వాడుతూ వస్తున్నాం. ఇప్పుడు మూంగ్ దాల్ అంటూ వచ్చిన స్నాక్ ఐటమ్ చిన్నా, పెద్దా అందరికి ప్రియమే. ఈ ఇష్టమైన పెసలలో చాలా ఆరోగ్య ప్రయోజనాలే ఉన్నాయి. వీటిలో విటమిన్ బి, విటమిన్ సి, మాంగనీస్ తోపాటు ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. అంతేకాదు సూర్యుని నుంచి వచ్చే అతినీలిలోహిత కిరణాలు, పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే చర్మ సమస్యల నుంచి కాపాడటానికి పెసలు సహకరిస్తాయి. ఇంతేనా పెసలలో ఇంకా చాలా హెల్త్ బెన్ఫిట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. పెసలు పోషకాల సమ్మేళనం. వీటిలో విటమిన్ ఎ, బి, సి, ఈ, ఖనిజ లవణాలు, క్యాల్షియం, ఇనుము, పొటాషియంతోపాటు మాంసకృత్తులు, పీచు ఉంటుంది. పెసలు తరచుగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్ చేస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. దీనివల్ల గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం చాలా తక్కువ. పెసలు తింటే ఆరోగ్యంతో పాటు యాక్టివ్ గా ఉండటానికీ సహకరిస్తాయి. పెసలలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోజు వారీ ఆహారంలో పెసల్ని చేర్చుకుంటే.. అనీమియా సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి పెసలు మంచి పరిష్కారం. రైస్ మాత్రమే కాకుండా.. బియ్యంతో పాటు కాసిన్ని పెసలు జోడించి వండుకుని తినడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. పెసల్లో రక్తంలోని షుగర్ లెవెల్స్ తగ్గించే గుణం ఉంది. కాబట్టి మీ డైట్ లో పెసలను చేర్చుకోవడం వల్ల.. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. క్యాన్సర్ బారిన పడకుండా చేస్తాయి. వీటిని తరచుగా తీసుకునే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కు అవకాశముండదు. పెసలు తీసుకోవడం వల్ల జీర్ణం సులువుగా అయ్యేట్లు సహాయపడతాయి. అంతేకాదు పెసలు ఇమ్యూనిటీ శక్తి పెంచుతాయి. కాబట్టి ఇన్ఫెక్షన్స్ దరి చేరకుండా ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తాయి. పెసలు తినటం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినదు. కండరాల నొప్పి, తలనొప్పి, నీరసాన్ని తగ్గించి చురుకుగా ఉంచడానికి పెసలు తోడ్పడతాయి. ఐరన్ లోపంతో బాధపడేవాళ్లు పెసలు తప్పకుండా తీసుకోవాలి. వెజిటేరియన్స్ లో ఎక్కువగా ఐరన్ లోపం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రోజు వారీ ఆహారంలో పెసలను చేర్చుకోవడం వల్ల అవసరమైన ఐరన్ ను ఈజీగా పొందవచ్చు. పెసలు శరీరంలో వేడిని తగ్గిస్తాయి. ఇవి వడదెబ్బ కొట్టినప్పుడు, చెమట కాయలు, దురదలు దద్దుర్లు వచ్చినప్పుడు వాడితే మంచి ఫలితం ఉంటుంది. కాలిన గాయాలు, ఎప్పటికీ మానని పుండ్లతో బాధపడే వాళ్లకు, ఆపరేషన్లు అయిన వారికీ పెసలు వంటలు పెట్టడం వల్ల ఉపశమనం కలుగుతుంది. సున్నిపిండిలో కూడా పెసలను వాడుతారు. దీనిని వాడినా.. చర్మం ముడతలు పడకుండా.. నిగారింపు సంతరించుకుంటుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







