బ్రిటన్ ప్రధాని థెరిసా మే హత్యకు కుట్ర, ఇంటి గేట్లు పేల్చి చంపేయాలని ప్లాన్!
- December 05, 2017
లండన్: బ్రిటన్ ప్రధాని థెరిసా మే తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రధాని థెరిసా మే హత్యకు గురి కాకుండా లండన్ భద్రతాదళాలు ఆమెను ప్రాణాలతో రక్షించారు. ఉత్తర లండన్ కు చెందిన నాయిముర్ జకారియా రెహ్మన్ (20), బర్మింగ్ హోమ్ కు చెందిన మహమ్మద్ అకీబ్ ఇమ్రాన్ (21) అనే ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
బ్రిటన్‌లో భారీ ఉగ్రవాద కుట్రను అక్కడి భద్రతాదళాలు చాకచక్యంగా భగ్నం చేశాయి. బ్రిటన్ ప్రధాని థెరిసా మేను హత్య చెయ్యడానికి స్థానికంగా నివాసం ఉంటున్న ఇద్దరు ఉగ్రవాదులు ప్రయత్నించారు. లండన్ ప్రధాని థెరిసా మే అధికార నివాసం అయిన డౌనింగ్ స్ట్రీట్ గేట్లు ఐఈడీ పేలుడుపదార్థాలతో పేల్చేయడానికి ప్రయత్నించారు.
ఆ సందర్భంగా జరిగే గందరగోళం మధ్యలో లండన్ ప్రధాని థెరిసా మేను అంతం చెయ్యాలని ప్లాన్ వేశారు. ఆ సందర్బంలో ఉగ్రవాదులను చాకచక్యంగా అడ్డుకున్న స్థానిక భద్రతాళాలు ఇద్దరిని ప్రాణాలతో పట్టుకుని అరెస్టు చేశారని స్కై న్యూస్ వెల్లడించింది.
ఇద్దరు ఉగ్రవాదులను బుధవారం వెస్ట్ మినిస్టర్ న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. డౌనింగ్ స్ట్రీట్ గేట్ల దగ్గర ఐఈడీ పేలుడు పదార్థాలు పేల్చి లండన్ ప్రధాని థెరిసా మేను హత్య చెయ్యాలని ఇద్దరు ఉగ్రవాదులు ప్లాన్ వేశారని స్థానిక పోలీసులు చెప్పారని స్కై న్యూస్ తెలిపింది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక