బిఐసి నేషనల్ డే ఫెస్టివల్లో కళ్ళు చెదిరే ఫైర్ వర్క్స్
- December 06, 2017
మనామా: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్, డిసెంబర్ 14 నుంచి 15 వరకు జరిగే బిఐసి నేషనల్ డే ఫెస్టివల్లో కళ్ళు చెదిరే ఫైర్ వర్క్స్‌తో ఆహూతుల్ని అలరించనుంది. డిసెంబర్ 16 మరియు 17 తేదీల్లో రాత్రి 7 గంటల సమయంలో ఈ ఫైర్ వర్క్స్ జరుగుతాయి. ఈ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనీ, ప్రతిఒక్కరూ ఫైర్ వర్క్స్‌ని ఎంజాయ్ చేయాలని బీఐసీ ఆహ్వానిస్తోంది. సఖిర్ ప్రాంతంలో జరిగే ఈ ఫెస్టివల్‌కి సంబంధించి ఫైర్ వర్క్స్‌ని సమీప ప్రాంతాల నుంచి కూడా తిలకించవచ్చు. వరుసగా ఐదో ఏడాది బిఐసి ఈ ఫెస్టివల్‌ని నిర్వహిస్తోంది. ప్రతిసారీ ఈ ఫెస్టివల్‌కి పెద్దయెత్తున ఆదరణ లభిస్తోందని బిఐసి వర్గాలు తెలిపాయి. బిఐసి నేషనల్ డే ఫెస్టివల్లో పాల్గొనాలనుకునేవారికి రోజుకి 500 ఫిల్స్ ప్రవేశ రుసుముగా నిర్ణయించారు. సాయంత్రం 4 గంటలకు గేట్స్ తెరవబడ్తాయి. 10 గంటలకు గేట్స్ క్లోజ్ చేయబడ్తాయి. ఫైర్వర్క్స్ సంగతి పక్కన పెడితే నైట్ కాన్సెర్ట్స్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ కానున్నాయి. సింగర్ అసలా డిసెంబర్ 16న తన అద్భుతమైన పెర్ఫామెన్స్‌తో సందర్శకులను అలరించనున్నారు.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







