ఆలూ కోఫ్తా కర్రీ
- December 06, 2017
కోఫ్తా కోసం కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు: అరకిలో(ఉడికించి మెత్తగా పెట్టుకోవాలి), చిన్న ఉల్లిపాయ: ఒకటి(ముక్కలుగా చేసుకొని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి), కారంపొడి: రుచికి సరిపడా, పసుపు: టేబల్ స్పూను, ఉప్పు: రుచికి సరిపడ, కొత్తిమీర: కొన్ని ఆకులు.
కూరకి కావలసిన పదార్థాలు: కారంపొడి: టేబుల్ స్పూను, ఎండు మిరపకాయల ముక్కలు: పావు టీస్పూను, ఉప్పు: సరిపడ, నీరు: ఒకటిన్నర కప్పు, నూనె: తగినంత, ఉల్లిపాయలు: పెద్దది (ముక్కలుగా చేసుకోవాలి), అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు స్పూన్లు, టమొటా ప్యూరి: రెండు టేబుల్ స్పూన్లు, క్రీము: రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర ఆకులు: కొన్ని.
తయారీ విధానం: ఓ గిన్నెలో కోఫ్తా పదార్థాలన్నీ వేసి బాగా కలిపి చిన్న చిన్న వుండలుగా చేసుకోవాలి. బాండీలో నూనె పోసి ఒకటి రెండు కోఫ్తాలు చొప్పున అన్నీ దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. కప్పు నీటిలో కారం, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కోఫ్తాలు వేయించగా మిగిలిన నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మరికొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న కారపు నీటిని పోసి కొద్దిగా తెర్లనివ్వాలి. దీనికి టమోటా ప్యూరీ కూడా కలిపి మరికొద్ది సేపు ఉడకనివ్వలి. ఓ పదినిమిషాల తరువాత క్రీము జతచేస్తూ బాగా కలపాలి. ఇప్పుడు కోఫ్తాలు కూడా జత చేసుకోవాలి. అన్నీ కలిపి మరికొద్దిసేపు ఉడికించి దించే ముందు కొత్తిమీర చల్లుకొని దించేయాలి.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక