లండన్:బీర్లతో కార్లు నడుస్తాయ్!
- December 07, 2017
లండన్: మీరు చదివింది నిజమే. బైకులు, కార్లు నడవాలంటే ఇక పెట్రోల్‌తో పనిలేదు. బీరు ఉంటే చాలు. బీరు ద్వారా ఇంధనాన్ని తయారు చేయడంలో సక్సెస్ అయ్యారు బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలు తీసుకురావాలన్న ఉద్దేశంతో సైంటిస్టులు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఆల్కహాలిక్ డ్రింక్స్‌లో ఉండే ఆల్కహాల్లో ఎథనాల్ ఉంటుందని, దీనిని బ్యుటనాల్‌గా మార్చి పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ ప్రొఫెసర్ డంకన్ వాస్ అన్నారు. ఎథనాల్ చాలా విరివిగా లభిస్తుంది. దీంతో దీనిని బ్యుటనాల్‌గా మార్చే టెక్నాలజీపై ఎన్నో ఏళ్లుగా సైంటిస్టులు ప్రయోగాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి లేబొరేటరీ స్థాయిలో శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు. ఎథనాల్‌ను బ్యుటనాల్‌గా మార్చే టెక్నాలజీని కాటలిస్ట్ అంటారు. ఇప్పటికే పెట్రోకెమికల్ ఇండస్ట్రీలో దీనిని పెద్ద ఎత్తున వాడుతున్నారు. తాజాగా తమ క్యాటలిస్ట్స్ బీర్లలోని ఎథనాల్‌ను విజయవంతంగా బ్యుటనాల్‌గా మార్చిందని డంకన్ వాస్ తెలిపారు.
దీనిని లేబొరేటరీ స్థాయి నుంచి పారిశ్రామిక స్థాయికి తీసుకెళ్లడానికి సైంటిస్టులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక