నేపాల్‌ లో భూకంపం...

- December 08, 2017 , by Maagulf
నేపాల్‌ లో భూకంపం...

కాఠ్మండూ: నేపాల్‌ దొలాఖా జిల్లాలో శుక్రవారం ఉదయం సంభవించిన భూకంపం ఆ ప్రాంత వాసులను వణికించింది. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో సంభవించిన ఈ ప్రకంపనలు రిక్టర్‌ స్కేల్‌పై 5.2 పాయింట్ల తీవ్రతను నమోదు చేసినట్లు జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ ఒక ప్రకటనలో వివరించింది. ఈ ప్రకంపనల కేంద్రం దొలాఖా జిల్లాలోని జిరి వద్ద 27.68 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 86.19 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య భూగర్భంలో 10 కి.మీ లోతులో వున్నట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ప్రకంపనల ప్రభావం రాజధాని ఖాట్మండులో కూడా కన్పించింది. 2015 ఏప్రిల్‌ 25న నేపాల్‌లో దాదాపు 9 వేల మందికి పైగా ప్రజలను బలి తీసుకున్న పెను భూకంపం తరువాత వివిధ ప్రాంతాల్లో పలుమార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com