బహ్రెయిన్‌లో కొరియా ఫిలిం ఫెస్టివల్‌ ప్రారంభం

- December 08, 2017 , by Maagulf
బహ్రెయిన్‌లో కొరియా ఫిలిం ఫెస్టివల్‌ ప్రారంభం

మనామా: నాలుగవ ఎడిషన్‌ కొరియన్‌ ఫిలిం ఫెస్టివల్‌ 'కొరియన్‌ మూవీ వీక్స్‌ 2017' సీఫ్‌ మాల్‌లో ప్రారంభమయ్యింది. మనామాలోని కొరియన్‌ ఎంబసీ, మూవీ లవర్స్‌ని ఈ ఫెస్టివల్‌కి ఆహ్వానిస్తోంది. కొరియా ఫౌండేషన్‌ మరియు కోబిజ్‌తో కలిసి ఈ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నారు. కొరియన్‌ అంబాసిడర్‌ కూ హ్యున్‌ మో మాట్లాడుతూ స్టూడెంట్స్‌, ఫ్యామిలీస్‌, డిప్లామాట్స్‌ని ఈ ఫెస్టివల్‌కి ఆహ్వానిస్తున్నామనీ, కొరియన్‌ కల్చర్‌ అలాగే మూవీస్‌ గురించి ఇక్కడ అవగాహన లభిస్తుందని అన్నారు. కొరియన్‌ స్నాక్‌ కింబాప్‌ని ఆహతులకు అందజేయనున్నట్లు చెప్పారు. ఈ డిసెంబర్‌లో ప్రతి బుధవారం రాత్రి 7 గంటలకు సినిమా ప్రదర్శనలు ఉంటాయి. 2018 పోంగ్‌చాంగ్‌ వింటర్‌ ఒలింపిక్‌ గేమ్స్‌కి ట్రిబ్యూట్‌గా తొలి సినిమాని ప్రదర్శిస్తున్నారు. వాస్తవ సంఘటన ఆధారంగా 'టేక్‌ ఆఫ్‌'ని ప్రదర్శించనుండడం గమనించదగ్గ విషయం. 2009లో ఈ చిత్రం బెస్ట్‌ యాక్టర్‌ కేటగిరీలో అవార్డ్‌ దక్కించుకుంది. వచ్చేవారం బెర్లిన్‌ ఫైల్‌ సినిమాని ప్రదర్శిస్తారు. ఇదొక థ్రిల్లర్‌ మూవీ. డిసెంబర్‌ 20, 27 తేదీల్లో 'ది ఫాటల్‌ ఎన్‌కౌంటర్‌', '200 పౌండ్స్‌ బ్యూటీ' చిత్రాల్ని ప్రదర్శిస్తారు. ఈ సినిమాలకు ప్రవేశం ఉచితం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com