నెంబర్ ప్లేట్ ఖరీదు 3.1 మిలియన్ దిర్హామ్‌లు
- December 09, 2017
యు.ఏ.ఈ:ఎమిరేటీ మాజిద్ ముస్తాఫా, ఇప్పటికే 5,000 స్పెషల్ నెంబర్ ప్లేట్స్కి ఓనర్. ఆయన కొత్తగా ఎఎ10 నెంబర్ ప్లేట్ కోసం 3,120,000 దిర్హామ్‌లు చెల్లించారు. రోడ్స్ అండ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నిర్వహించిన 97వ ఆక్షన్‌లో మాజిద్ ఈ నెంబర్ని దక్కించుకున్నారు. 10 ఎఎ కోడ్‌లో 12, 50, 103, 333, 786, 1000, 8888, 11111, 55555 వంటివి ఉన్నాయి. మొత్తంగా ఈ ఆక్షన్‌తో ఆర్టిఎ 12,750,000 దిర్హామ్‌ల మొత్తాన్ని దక్కించుకుంది. ఈసారి ఆక్షన్‌లో రెండో అత్యధిక మొత్తం ఎఎ 12 నెంబర్ ప్లేట్‌కి దక్కింది. 2,720,000 దిర్హామ్‌ల రేటు పలికింది ఈ నెంబర్ ప్లేట్. ఎస్సా అల్ హబ్బాయి ఈ నెంబర్ని దక్కించుకున్నారు. ముస్తఫా మాట్లాడుతూ, ఎఎ10 నెంబర్ ప్లేట్‌ని తన పర్సనల్ అవసరాల కోసం వినియోగిస్తానని చెప్పారు. 2002 నుంచి ఆక్షన్‌లో పాల్గొంటున్నారు ముస్తఫా. ఆయన వద్ద మొత్తం 5000 స్పెషల్ నెంబర్ ప్లేట్స్ ఉన్నాయి. ఆయన వద్ద ఉన్న అత్యధిక రేటు కలిగిన నెంబర్ ప్లేట్ ఐ10, 6 మిలియన్ల ధర పలికింది ఈ నెంబర్ ప్లేట్ అప్పట్లో.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







