కాల్చేశాడు...కోపమే కారణం

- December 09, 2017 , by Maagulf
కాల్చేశాడు...కోపమే కారణం

రాయిపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్‌పీ ఎఫ్‌ జవాను జరిపిన కాల్పుల్లో అదే విభాగానికి చెందిన నలుగురు జవాన్లు మృతి చెందారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం బస్తర్‌ ప్రాంతం బీజాపూర్‌లోని బసగూడ సీఆర్‌పీఎఫ్‌ 168 బెటాలియన్‌ క్యాంప్‌లో జరిగినట్టు ఆ ప్రాంత ఐజీ వివేకానందసిన్హా తెలిపారు. తన సీనియర్‌ సహచరులతో గొడవ పడి జవాను ఈ ఘటనకు పాల్పడినట్టు ఆయన తెలిపారు. ఆ ప్రాంత ఎస్పీతోపాటు సీనియర్‌ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షి స్తున్నట్టు ఆయన చెప్పారు. మృతుల్లో ఇద్దరు సబ్‌- ఇన్‌స్పెక్టర్లు, ఓ అసిస్టెంట్‌ సబ్‌-ఇన్‌స్పెక్టర్‌, ఓ కానిస్టేబుల్‌ ఉన్నారు. మరొకరికి గాయాలయ్యాయని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com