అందాల పోటీలపై మహిళా సంఘాల ఆందోళన

- December 10, 2017 , by Maagulf
అందాల పోటీలపై మహిళా సంఘాల ఆందోళన

విశాఖ: మిస్ వైజాగ్ అందాల పోటీలకు నిరసన సెగ తాకింది. అది ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు తగిలింది. మరికాసేపట్లో సాగరతీరంలో మిస్ వైజాగ్-2017 ఫైనల్స్ జరగనున్నాయి. మిస్ వైజాగ్ -2017 అందాల పోటీలను బహిష్కరించాలని మహిళా సంఘాల ప్రతినిధులు ఆందోళన చేస్తూ ఆయన నివాసం ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గంటా స్పందిస్తూ, పోటీలు నిర్వహించే తీరుతెన్నులు తెలుసుకుని ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాగా, మహిళల అంగాంగ ప్రదర్శన చేయడం 1986 యాక్టు కింద నేరమని, ఈ పోటీలను తక్షణమే నిలిపివేయాలని మహిళా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com