కేసీఆర్: జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీతలకు సత్కారం
- December 11, 2017
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రపంచ తెలుగు మహాసభలు పేరుకు అనుగుణంగా జరగాలని, సాహిత్య, భాష ప్రాధాన్యంగా ఉండాలని అన్నారు. హైదరాబాద్లోని ఎల్బీస్టేడియం ప్రాంగణంలో సభలు జరిగే ఐదు రోజులపాటు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా ఉండాలని ఆదేశించారు. ఎక్కడా లోటు రాకుండా జాగ్రత్త పడాలని అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వస్తారని తెలిపారు. ఈ సందర్భంగా సాహిత్య అకాడమీ ఛైర్మన్, ఇతర నిర్వాహకుల నుంచి సమావేశాల సన్నాహక కార్యక్రమాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. వివిధ భారతీయ భాషల్లో రచనలు చేసి జ్ఞానపీఠ్ అవార్డులను పొందిన వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించాలని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







