రంగస్థలం అలజడి..పిక్స్ లీకేజీపై సైబర్ క్రైమ్ కేసు
- December 11, 2017
మెగా అభిమానులను ఎంతగానో ఊరిస్తున్న చిత్రం 'రంగస్థలం'. ఇప్పటికే రిలీజైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ అందరికీ నచ్చేసింది. పల్లెటూరి కుర్రాడి ఊరమాస్ లుక్‌లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అదిరిపోయే రేంజ్‌లో ఉన్నారు. ఇందులో ఆయన 'చిట్టిబాబు' అనే పాత్రలో కనిపిస్తుండగా, మార్చి 30న థియేటర్లలో చిట్టిబాబును కలుసుకోండంటూ రామ్ చరణ్ ఇప్పటికే చెప్పేశారు. దీని ప్రకారం సినిమా విడుదల మరో మూడు నెలలు ఉంది.
అయితే మూడు నెల్లు టైమ్ వుందనగా అప్పుడే రంగస్థలం చిత్రానికి లీకుల బెడద మొదలైంది. తమ చిత్రం స్టిల్స్ లీక్ చేశారంటూ చిత్ర యూనిట్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. లీకులకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ అందులో పేర్కొన్నారు. సాధారణంగా ఓ భారీ చిత్రం వస్తుందంటే దానికి లీకుల బెడద ఉండనే ఉంటుంది. చిత్ర షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు దానికి సంబంధించిన స్టిల్స్, మాటలు, పాటలు, ఫైట్‌లు, వీడియోలు ఏవి లీకవుతుంటాయో అని చిత్ర యూనిట్ భయపడుతూ ఉండాల్సిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న లీకు వీరులు మాత్రం ప్రతిసారి పై చేయి సాధిస్తునే ఉన్నారు. దీంతా తాజాగా సమంత, రామ్ చరణ్ ల పిక్స్ లీక్ కావడంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వారు.
ఇక సినిమా విషయానికి వస్తే ప్రతి చిత్రం విషయంలో ఒక క్లారిటీ అంటూ కొనసాగించే సుకుమార్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. 1985లో జరిగిన స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథగా ఇది తెరకెక్కుతుండగా, ఇందులో చెర్రీ సరసన సమంత నటిస్తుంది. ఆది పినిశెట్టి, అనసూయ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జగపతి బాబు తదితరులు ముఖ్యపాత్రలలో కనిపిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







