డిసెంబర్ 16న వరంగల్‌లో `ఎంసీఏ` భారీ ప్రీ రిలీజ్ వేడుక
- December 11, 2017
నేచురల్ స్టార్ నాని, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం `ఎంసీఏ`. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటే్శ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ నిర్మాతలుగా సినిమా నిర్మితమవుతుంది. ఈ సినిమా డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబర్ 16న వరంగల్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా... హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ``డబుల్ హ్యాట్రిక్ హీరో నాని ఈ ఏడాది ప్రారంబంలో మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో `నేను లోకల్` సినిమాతో హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ ఏడాది చివరల్లో `ఎంసీఏ` సినిమాతో మరో హిట్‌ను సాధించబోతున్నాడు. ఈ సినిమా సక్సెస్‌తో మా బ్యానర్ ఒకే ఏడాది డబుల్ హ్యాట్రిక్ సాధిస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. రేపు (డిసెంబర్ 12న) ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయనున్నాం. ఈ సినిమా కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. వదిన, మరిదిల మధ్య అనుబంధాన్ని తెలియజేసే చిత్రంగా మా ఎంసీఏ ప్రేక్షకుల ముందుకు డిసెంబర్ 21న విడుదల కానుంది. సినిమా ప్రారంభం నుండి నాని, సాయిపల్లవి జంట ఈ సినిమాలో నటిస్తున్నారనగానే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
సినిమా చాలా బాగా వచ్చింది. శ్రీరామ్ వేణు సినిమా ను చక్కగా డైరెక్ట్ చేశాడు. దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సాంగ్స్‌ను అందించాడు. ఈ పాటలు అల్రెడి మార్కెట్లోకి విడుదలయ్యయాయి.
సాంగ్స్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే . ఈ డిసెంబర్ 16న వరంగల్‌లో ప్రీ రిలీజ్ వేడుకను అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నాం`` అన్నారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







