సౌదీలో గృహ సేవకురాళ్లకు ఇక ఆరు నెలల ప్రీపెయిడ్ శాలరీ కార్డుల

- December 13, 2017 , by Maagulf
సౌదీలో గృహ సేవకురాళ్లకు ఇక ఆరు నెలల ప్రీపెయిడ్ శాలరీ కార్డుల

రియాధ్: జీతాలు ఎగవేత ...యజమాని మోసం, అరకొర వేతనాలు వంటి ఆరోపణలు ఇకపై సౌదీ అరేబియా వినిపించవు. ఈ తరహా మోసాలను నిలువరించేందుకు ఒక వినూత్న పథకాన్ని ఆ దేశం ప్రవేశపెట్టనుంది. . ‘ప్రీపెయిడ్ శాలరీ కార్డు’ల పేరిట వినూత్న పథకం సౌదీ అరేబియా ప్రారంభించనుంది. దేశంలోని ప్రతి ఒక్క సౌదీ యజమాని ఆరు నెలల్లోగా ప్రీపెయిడ్ శాలరీ కార్డులను తీసుకోవాలనీ, వాటిని తమ తమ ఇంట పనిచేసే గృహ సేవకురాళ్లకు అందచేయాలని సౌదీ కార్మిక మరియు లేబర్ అండ్ సామాజికాభివృద్ధి శాఖ యజమానులకు సూచించింది. పనిమనిషి గురించిన అన్ని వివరాలను నమోదు చేయించి ఈ కార్డులను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని పనిమనుషులకు ఇస్తుంటారు. యజమాని బ్యాంకు ఖాతా నుంచి నేరుగా ప్రతి నెలా జీతం ఆ కార్డుల్లోకి బదిలీ కావడంతో జీతాలు తొక్కిపెట్టి రాక్షసానందం పొందే అవకాశం లేకుండా సౌదీ ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. ఈ కార్డులను వినియోగించుకొనే గృహ సేవకురాళ్లు తమకు ఇష్టం వచ్చినప్పుడు డబ్బులను తీసుకోవచ్చు. గతంలో ఎక్కువ శాతం మంది యజమానులు జీతాలను నేరుగా పనిమనిషికే ఇస్తుండేవారు. ఆ వేతనం ఒప్పందంలో ఓ విధంగా.. ఇచ్చేటప్పుడు మరో విధంగా వారికి ఇచ్చే జీతాల్లో భారీ వ్యత్యాసాలు ఉండేవి.మరి కొందరు అసలు జీతమేఇవ్వకుండా కొన్నాళ్లపాటు పని చేయించుకుని ప్రవాసీయులను పలు ఇక్కట్లకు గురిచేసిన సందర్భాలు సైతం పలు నమోదైయ్యాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నూతన సంస్కరణ అమలులోకి తీసుకొచ్చింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com