ఇండియన్‌ స్కూల్‌ ములాదాలో కిడ్డీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌

- December 13, 2017 , by Maagulf

మస్కట్‌: ఇండియన్‌ స్కూల్‌ ములాదా, కిడ్డీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ 2017ని ఘనంగా నిర్వహించింది. స్కూల్‌ క్యాంపస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి వాలీద్‌ షాబిబ్‌ సబిల్‌ అల్‌ బలుషి, అల్‌ బలాది కౌన్సిల్‌ మెంబర్‌ అల్‌ ముసాన్నా హాజరయ్యారు. స్కూల్‌ ల్యాండ్‌ లార్డ్‌ షేక్‌ యాకుబ్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ బ్రైక్కెయి గెస్ట్‌ ఆఫ్‌ హానర్‌గా వ్యవహరించారు. హెడ్‌ బాయ్‌ ఫహాద్‌ రెహ్మాన్‌, హెడ్‌ గర్ల్‌ శ్రీలక్ష్మి జయరాజన్‌ చీఫ్‌ గెస్ట్‌ సహా ప్రముఖులకు స్వాగతం పలికారు. ఒమన్‌, అలాగే భారతదేశానికి చెందిన జాతీయ గీతాల్ని చిన్నారులు ఆలపించారు. కేజీ స్టూడెంట్స్‌ నిర్వహించిన డిసిప్లిన్డ్‌ వాక్‌ అందర్నీ ఆకట్టుకుంది. చీఫ్‌ గెస్ట్‌ మాట్లాడుతూ, చిన్నారులకు ఆటలు ఎంత ముఖ్యమో వివరించారు. విద్యాభ్యాసంలో ఆటలు కూడా ఓ భాగమేనని చీఫ్‌ గెస్ట్‌ చెప్పడం జరిగింది. ఈ సందర్బంగా పలు క్రీడల్ని నిర్వహించగా, క్రీడల్లో విజయాలు సాధించిన విజేతలకు బహుమతుల్ని ప్రముఖుల మీదుగా అందజేశారు. ప్రిన్సిపాల్‌షరీఫ్‌ మాట్లాడుతూ, ఆటలతో పిల్లల్లో ఫిజికల్‌ గ్రోత్‌ పెరగడమే కాకుండా, మానసికంగా వారు ధృఢంగా తయారవుతారని చెప్పారు. కిండర్‌గార్టెన్‌ విద్యార్థుల్ని కూడా ఇలాంటి వేడుకల్లో భాగస్వాముల్ని చేయడానికి టీచర్లు పడ్డ కృషిని ప్రిన్సిపాల్‌ అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com