ఫుల్‌ స్వింగ్‌లో లైన్‌ 6 ప్రాజెక్ట్‌

- December 15, 2017 , by Maagulf
ఫుల్‌ స్వింగ్‌లో లైన్‌ 6 ప్రాజెక్ట్‌

మనామా: అల్యూమినియమ్‌ బహ్రెయిన్‌ (అల్బా), తమ ల్యాండ్‌ మార్క్‌ లైన్‌ 6 ఎక్స్‌పాన్షన్‌ ప్రాజెక్ట్‌ పనుల్ని శరవేగంగా చేపడుతోంది. ఫస్ట్‌ హాట్‌ మెటల్‌ (ఎఫ్‌హెచ్‌ఎం) షెడ్యూల్‌ని అనుకున్న విధంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు అల్బా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఛైర్మన్‌ షేక్‌ దైజ్‌ బిన్‌ సల్మాన్‌ బిన్‌ దైజ్‌ అల్‌ ఖలీఫా. నాలుగవ క్వార్టర్లీ మీటింగ్‌ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు షేక్‌ దైజ్‌ బిన్‌ సల్మాన్‌ బిన్‌ దైజ్‌ అల్‌ ఖలీఫా. 2018 యాన్యువల్‌ ప్లాన్‌ని ఈ సందర్భంగా బోర్డ్‌ రివ్యూ చేసి, ఆమోదించింది. అలాగే కార్పొరేట్‌ వర్నఎన్స్‌ రిపోర్ట్‌, క్యూ 3 2017 ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్‌ని కూడా ఆమోదించడం జరిగింది. సేఫ్టీపై ఎగ్జిక్యూటివ్‌ మేనేజ్‌మెంట్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. లైన్‌ 5 రికవరీ, మెటల్‌ ప్రొడక్షన్‌ సహా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. మార్కెట్‌ కండిషన్స్‌ని అనుగుణంగా ప్రాజెక్ట్‌ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తామని షేక్‌ దైజ్‌ బిన్‌ సల్మాన్‌ బిన్‌ దైజ్‌ అల్‌ ఖలీఫా చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com