పెళ్లికూతురైన కలర్స్ స్వాతి
- May 02, 2015
కథానాయిక స్వాతి పెళ్లి కూతురైంది.. సంప్రదాయ పద్దతిలోఈ సుందరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ పెళ్లి జరిగింది రియల్ లైఫ్‌లో అనుకుంటే పొరపాటు పడినట్లే. ఇది రీల్‌లైఫ్ పెళ్లి మాత్రమే. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటనకు ఆస్కారమున్న పాత్రలతో వరుస విజయాల్ని దక్కించుకుంటున్న స్వాతి నటిస్తున్న తాజా చిత్రం త్రిపుర. క్రేజీ మీడియా పతాకంపై ఎ.చినబాబు, ఎం. రాజశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజకిరణ్ దర్శకుడు. తొలిషెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. ఈసందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ హారర్, థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. త్రిపుర ఎవరు? తన కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న ఆమె జీవితంలో చోటు చేసుకున్న కొన్ని అనూహ్య పరిణామాలేమిటి? వాటివల్ల ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నదే సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పలు అద్భుతమైన లొకేషన్స్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించాం అని తెలిపారు. 40 శాతం టాకీ పూర్తయిందని, కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల్ని ఈ చిత్రం తప్పకుండా మెప్పిస్తుందని నిర్మాతలు చెప్పారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







