త్వరలో 10 కోట్ల కొత్త ఉద్యోగాలు.!
- December 21, 2017
దేశ యువతకు ఉద్యోగాల కల్పన, వారికి నైపుణ్యాభివృద్ధే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం ద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. 2020 నాటికి దేశంలో మొత్తం 10 కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు నీతి ఆయోగ్ డైరెక్టర్ జనరల్ - డీఎంఈవో, సలహాదారు అనిల్ శ్రీవాత్సవ వెల్లడించారు. మేకిన్ ఇండియా, కొన్ని స్టార్టప్ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం గత కొన్నేళ్లుగా దేశంలోకి పెట్టుబడులఅవకాశాలను పెంచిందన్నారు. స్మార్ట్టెక్ మ్యానుఫేక్చరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండియా సదస్సులో ఆయన ప్రసంగించారు. 2020 నాటికి ఎలక్ట్రానిక్స్ పరికరాల దిగుమతులను సున్నా స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఎదరయ్యే సవాళ్లు, అవకాశాలపై చర్చించేందుకు ఇదో గొప్ప వేదికగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







