దుబాయ్ చెక్కేసిన పెళ్లిళ్ల ఏజెంట్ హబీబ్‌ఖాన్
- December 24, 2017
హైదరాబాద్: అమాయక యువతులపై నిఖా పేరిట దగా చేస్తున్న బ్రోకర్లు, ఖాజీలపై ఉక్కు పాదం మోపుతాం. ఆయా నిందితులపై పీడీయాక్టులు ప్రయోగించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించి కార్యాచరణలోకి దిగక ముందే పోలీసుల కళ్లు గప్పి మరో ఖాజీ దుబాయ్ పారిపోయాడు. ఖాజీలు, వారికి సహకరించిన ఏజెంట్లు ఏ క్షణంలోనైనా పారిపోయే అవకాశముందని స్వయానా పోలీసులే ప్రకటించారు. వారి పాస్‌పోర్టులను సీజ్ చేస్తామని చెప్పారు. కానీ కొంతమంది మాత్రం పోలీసులకే షాకిస్తున్నారు. ఇదే తరహాలో ఫలక్‌నుమాకు చెందిన మహమ్మద్ హబీబ్ ఖాన్ అనే ఏజెంటు దుబాయ్‌కు పారిపోయాడు. అరబ్బు షేక్‌లతో పెళ్లిళ్లు జరిపించడంతో పాటు నకిలీ ఖాజీల ద్వారా కూడా నిఖాలు జరిపించినట్లు అతనిపై ఆరోపణలున్నాయి. ఇటీవల అరెస్టు చేసిన ఖాజీలతో పాటు జైలుకు వెళ్లిన హబీబ్ ఖాన్ బెయిల్‌పై విడుదలై నేరుగా దుబాయ్ పారిపోయినట్లు పోలీసులు ధృవీకరించారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







