మాలిక్యులస్ ఫైల్స్: యూఏఈ మినిస్ట్రీ హెచ్చరిక
- December 26, 2017
టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్ఎ), వాట్సాప్ లేదా ఇ-మెయిల్ ద్వారా మాలిక్యులస్ పీడీఎఫ్ ఫైల్స్‌ని పంపడం నేరమని ప్రకటించింది. ఈ తరహా చర్యల ద్వారా ఇతరుల ఫోన్లలోని డేటాని తస్కరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని టిఆర్ఎ పేర్కొంది. టిఆర్ఎ - నేషనల్ పిసి ఎమర్జన్సీ రెస్పాన్స్ టీమ్, గడచిన పది నెలల్లో ఈ తరహా ఎటాక్స్ని 15 వరకు ఎదుర్కొన్నామనీ, ఈ సైబర్ ఎటాక్స్ ప్రధానంగా ప్రభుత్వ మరియు సెమీ గవర్నమెంట్ బాడీస్‌కి చెందిన కంప్యూటర్స్‌ని టార్గెట్ చేస్తున్నాయనీ, ప్రైవేట్ సెక్టార్‌కి కూడా వీటి కారణంగా ముప్పు పొంచి ఉందని అధికారులు వెల్లడించారు. ఎలక్ట్రానిక్ డివైజెస్‌ని వినియోగిస్తున్నవారు, ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, తెలిసిగానీ తెలియకగానీ ఫైల్స్‌ని గ్రూప్స్‌లో షేర్ చేయరాదని టిఆర్ఎ సూచించింది. యాంటీ సెక్యూరిటీ వైరస్‌ని పీడీఎఫ్ ఫైల్స్‌లో నింపి, వాటి ద్వారా ఇతర కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ డివైజెస్‌లోని డేటాని తస్కరిస్తున్నారు సైబర్ క్రిమినల్స్. తద్వారా ఆయా కంప్యూటర్స్‌ని హాకర్స్ తమ ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతోంది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక