నేడు ఇందిరాగాంధీ జయంతి

- November 19, 2015 , by Maagulf
నేడు ఇందిరాగాంధీ జయంతి

 భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. గురువారం ఇందిరాగాంధీ జయంతి.ఈ నేపథ్యంలో భారత తొలి మహిళ ప్రధాని ఇందిరాగాంధీకి ఘన నివాళులు అని మోదీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇందిరాగాంధీ 1917, నవంబర్ 19న జన్మించిన భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు, కమల నెహ్రూ దంపతులకు ఇందిర ఏకైక సంతానం. 1966 -1977 వరకు ఇందిరాగాంధీ భారత ప్రధానిగా ఉన్నారు. ఆ తర్వాత 1980లో మళ్లీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1984లో అక్టోబర్ 31వ తేదీన ప్రధాని ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులే హత్య చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com