రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన చైనా

- December 27, 2017 , by Maagulf
రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన చైనా

విద్యుదయస్కాంత తరంగాలు, పర్యావరణ సంబంధిత అంశాల పరిశోధనకు సంబంధించిన రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలను చైనా మంగళవారం విజయవంతంగగా ప్రయో గించింది. లాంగ్‌మార్చ్‌ రాకెట్‌ శ్రేణిలో జరిగిన ఈ ప్రయోగం 260వదని అదికార సిన్హువా వార్తాసంస్థ వెల్లడించింది. నైరుతి సిచువాన్‌ ప్రావిన్స్‌లోని జిచాంగ్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి లాంగ్‌మార్చ్‌-2సి రాకెట్‌ ద్వారా ఈ ఉపగ్రహాలను రోదసిలోకి పంపినట్లు సిన్హువా తన వార్తా కథనంలో పేర్కొంది. ఈ ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష్యల్లోకి విజయవంతంగా ప్రవేశించాయని, మొత్తమ్మీద ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతమైందని తెలిపింది. అయితే ఎన్ని ఉపగ్రహాలు ప్రయోగించారన్న విషయాన్ని సిన్హువా వెల్లడించలేదు. యోగాన్‌-30 ప్రాజెక్టుకు చెందిన మూడోబృం దంలోని ఈ ఉపగ్రహాలు విద్యుదయస్కాంత తరంగాలు, పర్యావరణ సంబంధిత అంశాలపై ప్రయోగాలు నిర్వహిస్తాయని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com