నేడు లోక్ సభ ముందుకు ట్రిపుల్ తలాక్ బిల్లు

- December 27, 2017 , by Maagulf
నేడు లోక్ సభ ముందుకు ట్రిపుల్ తలాక్ బిల్లు

ట్రిపుల్ తలాక్ బిల్లు గురువారం లోకసభ ముందుకు రానుంది. ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ రూపొందించిన ఈ బిల్లును న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోకసభలో ప్రవేశపెట్టనున్నారు.

ముస్లిం మహిళా (వివాహ రక్షణ హక్కులు) బిల్లుకు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని బృందం రూపకల్పన చేసింది. మూడు సార్లు తలాక్ అని చెప్తే ముస్లిం పురుషుడికి భార్యతో విడాకులు తీసుకునే అవకాశం ఉంటూ వచ్చింది.

దాన్ని అక్రమంగా పరిగణిస్తూ ఈ బిల్లును రూపొందించారు. బిల్లు చట్టరూపం ధరిస్తే ట్రిపుల్ తలాక్ చెప్పే పురుషుడికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా పడుతుంది. మత పెద్దలతో చర్చించిన తర్వాతనే బిల్లును ప్రతిపాదించాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీని కోరింది.

బిల్లును రూపొందించడంలో ఏ విధమైన పద్ధతిని అవలంబించలేదని విమర్శించింది. ట్రిపుల్ తలాక్ అక్రమమని, రాజ్యాంగ విరుద్ధమని, అర్థరహితమైనదని సుప్రీంకోర్టు ఆగస్టులో అభిప్రాయపడింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం బిల్లును రూపొందించింంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com