వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్..!
- December 29, 2017ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం ఓ అదిరిపోయే ఫీచర్‌ను అతి త్వరలో అందుబాటులోకి తేనుంది. గ్రూప్‌లలో ఉన్న యూజర్లు వ్యక్తిగతంగా చాటింగ్ చేసుకునేందుకు ఉపయోగపడే 'ప్రైవేట్ రిప్లై' ఫీచర్ ఇప్పటికే వాట్సాప్ బీటా వెర్షన్లో అందుబాటులో ఉండగా ఇకపై ఈ ఫీచర్ యూజర్లందరికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు వాట్సాప్‌లో ఏదైనా గ్రూప్‌లో ఉన్న మరో యూజర్‌తో ప్రైవేట్‌గా చాటింగ్ చేయవచ్చు. అందుకు గ్రూప్‌ను వదిలి వెనక్కి రావల్సిన పనిలేదు. గ్రూప్‌లో ఉండగానే యూజర్ పెట్టే మెసేజ్‌లపై హోల్డ్ చేసి పట్టుకుంటే వచ్చే మెనూలో ఉండే 'రిప్లై ఇన్ ప్రైవేట్' అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే చాలు, గ్రూప్‌తో సంబంధం లేకుండా ఆ యూజర్‌తో ప్రైవేట్‌గా చాటింగ్ చేయవచ్చు. కాగా ఈ ఫీచర్ విండోస్ ఫోన్ 2.17.348 బీటా వెర్షన్లో తాజాగా దర్శనమిచ్చిందని పలువురు యూజర్లు తెలియజేస్తున్నారు.
తాజా వార్తలు
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..